తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, ఖమ్మం పాల పరిధి
సంస్థ గురించి వివరణ :
గ్రామీణ ప్రజలకు వారి జీవనోపాధికి ఆర్ధిక తోడ్పాటు అందించుటకు ప్రభుత్వం 1975 సంవత్సరంలో ఖమ్మం డేయిరి మరియు తదుపరి ఆరు చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములను ఏర్పాటుచేసింది.
అధికారుల పేర్లు,వివరములు :
క్రమ.సంఖ్య | అధికారి పేరు | హోదా | మెయిల్ | ఫోన్ నంబరు |
---|---|---|---|---|
1 | శ్రీ. పి.మోహన్ మురళి | డిప్యూటి డైరెక్టర్ | ddkhm.tsddcf[at]gmail[dot]com | 9515060691 |
2 | శ్రీ. బి. కృష్ణ | ఇన్ ఛార్జ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ | ddkhm.tsddcf[at]gmail[dot]com | 9666057804 |
3 | శ్రీమతి. జి.నాగమణి | ఇన్ ఛార్జ్ మేనేజర్ | ddkhm.tsddcf[at]gmail[dot]com | 8374173224 |
సంస్థ యొక్క విధులు:
- జిల్లాలోని వివిధ గ్రామాల నుండి పాలను తగిన ధరకు కొనుగోలు చేయుట
- పట్టణములోని వినియోగదారులకు తగిన ధరకు సరఫరా చేయబడును.
- పాడి పశువుల కొనుగోలు నిమిత్తము కొనుగోలు చేయుటకు వారికి బ్యాంకు ఋణములు మంజూరు చేయించుటలో తోడ్పాటు అందించుట.
- పాల నాణ్యతను పరిక్షించుటకు పాల పరీక్షా యంత్రములను సరఫరా చేయుట.
- గ్రామాల నుండి పాలు సేకరించుటకై 40 లీటర్ల క్యానులను అందుబాటు చేయుట.
- పాలను శీతలీకరణ చేయుటకు మండల పరిధిలో చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములను ఏర్పాటు చేయుట,
- పాడి రైతులకు ప్రభుత్వ పశువుల దాణ కర్మాగారము నుండి దాణ సరఫరా చేయుట
ప్రభుత్వ పథకాలు:
కేంద్ర ప్రభుత్వ పథకాలు ద్వారా చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములు ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, కామేపల్లీ, కల్లూరు మరియు సత్తుపల్లి ప్రదేశములలో ఏర్పాటు చేయబడ్డవి.
- ఐడిడిపి x ప్లాన్-3
- ఆర్కెవివై-2
- సిఎం ప్యాకేజి-1
ప్రస్తుత ప్రగతి నివేదిక:
- ప్రస్తుత రోజువారి పాల సేకరణ = 9000లీటర్లు
- ప్రస్తుత రోజువారి పాల అమ్మకాలు = 8000లీటర్లు
- పాలు సేకరణ చేయు రూట్లు = 19
- పాలు సేకరణ కేంద్రములు = 199
- పాల ఉత్పత్తిదారులు = 1200
ఉపసంచాలకులు
ఖమ్మం మిల్క్ షెడ్,
ఖమ్మం.