ముగించు

ఆసక్తి ఉన్న స్థలాలు

జమలాపురం

జమలాపురం వేంకటేశ్వరాలయం

ఖమ్మం మరియు విజయవాడలకు 85 కి.మీ దూరంలో ఉన్నటువంటి జమలాపురంలో పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం కలదు. తెలంగాణ చిన్న తిరుపతి, స్వయంభూ మరియు స్వయంవ్యక్త గా పిలవబడే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంకు ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. పవిత్రంగా భావించే ఈ గుడిలో భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు పూజలు నిర్వహిస్తారు.

కల్లూరు

వేణుగోపాల స్వామీ ఆలయం

ఖమ్మం పట్టణంకు 50 కి.మీ దూరంలోని కల్లూరు నందు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి ఆలయం కలదు. దీనికి సమిపంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ప్రతిష్టించబడిన పంచ శివలింగాలు కలిగిన శివాలయం మరియు చెరువు కలదు.

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం

భక్త రామదాసు స్మారక మందిరం

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం ఉన్నటువంటి నేలకొండపల్లి మండలం అప్పటి తహసిల్దారుగా పనిచేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నిర్మించిన శ్రీ కంచర్ల గోపన్న (శ్రీ భక్త రామదాసు) పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందినది. అందువలన గ్రామస్తులు శ్రీ సీతారామ స్వామి దేవస్థానం నిర్మించి సీతారాములు తో పాటుగా లక్ష్మణస్వామి, భక్త రామదాసు విగ్రహాలు ప్రతిష్టించి రొజూ పూజలు నిర్వహిస్తున్నారు.

పురాతన ప్రదేశాలు:

ఖమ్మం కోట:

ఖమ్మం ఖిల్లా

పురాతన చరిత్ర కలిగిన ఖమ్మం కోట 950ఎడి నందు కాకతియులతో నిర్మించబడినది. 1512లో కుతుబ్ షాహీ పాలకుల చేతుల్లోకి వెళ్ళిన ఈ కోట తర్వాత కాలంలో 17వ శతాబ్దంలో అసఫ్జాహి పాలకుల చేతుల్లోకి వెళ్ళినది. గ్రానైట్ రాళ్ళతో నిర్మితమైన ఖమ్మం కోట ఖమ్మం పట్టణ నడిబొడ్డున ఠీవిగా వున్నది.

కూసుమంచి:

కూసుమంచి శివాలయం

ఖమ్మం పట్టణంకు 21కి.మీ దూరంలో కాకతీయుల కాలంలో ప్రతిష్టించబడిన పెద్ద శివలింగంతో నిర్మితమైన గుడి కలదు. ఇచట శివరాత్రి సమయంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తారు.

నేలకొండపల్లి:

నేలకొండపల్లి బౌద్ధ స్థూపం

నేలకొండపల్లి ఖమ్మం పట్టణంకు 21కి.మీ దూరంలో 100ఎకరాల విస్తీర్ణంలో మట్టి ప్రహరీ గోడల మధ్య కోట వంటి నిర్మాణం కలిగినటువంటి పురాతన ప్రదేశం. ఇచట పురావస్తు తవ్వకాలలో ఇటుకలతో నిర్మితమైన బౌద్ధ విహారాలు, నీటి తొట్టిలు, ఒక మహాస్తూపం, టెర్రకోట విగ్రహాలు, ఒక ఇత్తడి బుద్ధ ప్రతిమ, సున్నపు రాయితో చెక్కబడిన చిన్న స్తూపం మరియు 3,4వ శతాబ్దంకు చెందిన ఇతర చారిత్రక వస్తువులు బయల్పడినాయి. ఒక కధ ప్రకారం అజ్ఞ్యాతవాసంలో పాండవులు ఇచట విరాట నగరపు రాజు అయినటువంటి విరాట రాజు కొలువులో అజ్ఞ్యాతంగా పని చేసినారని నమ్మకం.