• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

జిల్లా ప్రజా పరిషత్, ఖమ్మం

జిల్లా ప్రజా పరిషత్ లు ది. 01.11.1959 నుండి అమలులోనికి వచ్చినది.  1959 సంవత్సరం కన్నా ముందు ఏ.పి. ఆంధ్ర ఏరియా జిల్లాబోర్డుల చట్టం, 1920 మరియు ఏ.పి. తెలంగాణ ఏరియా జిల్లాబోర్డుల చట్టం, 1955 క్రింద జిల్లా బోర్డ్ లు నిర్వహించ బడుచుండేవి.  బల్వంతరాయ్ మెహతా కమిటీ Aఆధికార వికేంద్రికరణ గ్రామ స్థాయి, మండల స్థాయి, మరియు జిల్లా స్థాయిలలో జరుగుటకు మూడు అంచెల విధానమును ప్రతిపాదించినది.  జిల్లా ప్రజా పరిషత్ లు మరియు మండల ప్రజా  పరిషత్ లు   ప్రస్తుత చట్ట సవరణ కన్నా ముందు ఏ.పి. మండల ప్రజా పరిషత్ లు మరియు జిల్లా ప్రజా పరిషత్ లు మరియు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలాల చట్టం 1986 ప్రకారం నిర్మితమై ఉన్నవి.ఆంధ్ర ప్రదేశ్  పంచాయతీ రాజ్ చట్టం 1964 మరియు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా అభివృద్ధి సమీక్షా మండల చట్టం 1986 స్థానంలో ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం నెం.13 , 1994 ది.30.05.1994 అమలులోనికి వచ్చినది.  ఈ చట్టం గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్ లు మరియు జిల్లా ప్రజా పరిషత్ ల యొక్క ఎలక్షన్స్, మీటింగుల నిర్వహణ, ప్రతి అంచెల మధ్య సంబంధం, పరిపాలన బడ్జెట్ రిపోర్టులు మరియు మొదలగు విషయములలో సమీకృతం గావించబడినది.జిల్లా ప్రజా పరిషత్, ఖమ్మం యొక్క సాధారణ సభ 41 మంది జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులతో కూడినది.  అందు శ్రీయుత జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు   ఉపాధ్యక్షులు, ఇద్దరు కో-అప్ట్టేడ్ సభ్యులు కలరు.  మరియు గౌరవ పార్లమెంట్ లోక్ సభ, రాజ్య సభ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు కుడా పై సాధారణ సభలో సభ్యులుగా ఉందురు.  వీరితోపాటు శ్రీయుత జిల్లా కలెక్టర్, జిల్లాలోని అందరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షులు, జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు, మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు, పై జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశములకు శాస్వత ఆహ్వానితులు.

 

జిల్లా ప్రజా పరిషతుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరియు ఆధికారుల వివరములు
క్రమసంఖ్య పేరు హొదా ఆధికారి ఫోన్ నెంబర్ మెయిల్ ఐ డీస్
1 చైర్ పర్సన్ czppkmm2019@gmail.com
2 ముఖ్యకార్యనిర్వహణాధికారి ceozpkmm[at]gmail[dot]com
3 ఉపముఖ్యకార్యనిర్వహణాధికారి  (ఎఫ్ఏసి) ceozpkmm[at]gmail[dot]com

 

జిల్లా ప్రజా పరిషతుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు (జడ్.పి.టి.సి.) ల వివరములు
క్రమ సంఖ్య పేరు (శ్రీ/శ్రీమతి) మండల్ ఆధికారి ఫోన్ నెంబర్
1 బోనకల్
2 చింతకాని
3 ఏన్కూర్
4 కల్లూరు
5 కామేపల్లి
6 ఖమ్మం రూరల్
7 కొణిజెర్ల
8 కూసుమంచి
9 మధిర
10 ముదిగొండ
11 నేలకొండపల్లి
12 పెనుబల్లి
13 రఘునాధపాలెం
14 సత్తుపల్లి
15 సింగరేణి
16 తల్లాడ
17 తిరుమలాయపాలెం
18 వేంసూరు
19 వైరా
20 ఎర్రుపాలెం
21 ఖమ్మం
22 ఖమ్మం

 

మండల పరిషత్ అభివృద్ధి అధికారుల వివరములు
క్రమ సంఖ్య ఆధికారి పేరు (శ్రీ/శ్రీమతి) మండలం పేరు ఆధికారి ఫోన్ నెంబర్ మెయిల్ ఐ డీస్
1 యం.విద్యాలత బోనకల్ 9440906910 mpdo_2244[at]yahoo[dot]com
2 యం.డి.నవాబ్ పాషా చింతకాని 9440906911 mpdochinthakani[at]gmail[dot]com
3 కె.పాపారాణి ఏన్కూర్ 9440906929 mpdoenkoor[at]yahoo[dot]in
4 బి.శివకుమారి  (ఎఫ్ఏసి) కల్లూరు 9440906912 mpdokalluru[at]yahoo[dot]com
5 పి.విజయ కామేపల్లి 9440906938 mpdokamepally[at]gmail[dot]com
6 సి.హెచ్.శ్రీనివాస రావు ఖమ్మం రూరల్ 9440906914 mpdokmmr[at]yahoo[dot]com
7 పి.శ్రీనివాస రావు కొణీజెర్ల 9440906915 konijerla2014[at]gmail[dot]com
8 యం.విద్యాచందన కూసుమంచి 9440906916 mdoksm85[at]gmail[dot]com
9 పి.ఆల్బర్ట్ మధిర 9440906917 mdomadhira[at]gmail[dot]com
10 పి.నర్మదా ముదిగొండ 9440906918 mudigondampdo[at]gmail[dot]com
11 డి.పురుషోత్తం నేలకొండపల్లి 9440906919 mpdonelakondapally[at]gmail[dot]com
12 ఆర్.వి.సుబ్రహ్మణ్యం పెనుబల్లి 9440906921 penuballi.mpdo[at]gmail[dot]com
13 ఇ. శ్రీనివాస రావు రఘునాధపాలెం 9440906913 mpdokmmu[at]gmail[dot]com
14 ఎన్.రవి సత్తుపల్లి 9440906922 mpdomppsathupally[at]gmail[dot]com
15 ఎ.శ్రీనివాస రావు సింగరేణి 9440906939 smpdo[at]yahoo[dot]com
16 ఎ. శ్రీనివాస రెడ్డి తల్లాడ 9440906923 mpdothallada[at]gmail[dot]com
17 డి.శిరీష తిరుమలాయపాలెం 9440906924 mpdotirumalayapalem[at]gmail[dot]com
18 బి.గోవిందరావు వేంసూరు 9440906920 mnregsvemsoor[at]gmail[dot]com
19 బి.మల్లేశ్వరి వైరా 9440906925 mpdowyram[at]yahoo[dot]com
20 డి.శ్రీనివాస రావు ఎర్రుపాలెం 9440906926 mpdoyerrupalem[at]yahoo[dot]in

జిల్లా ప్రజా పరిషత్ యొక్క విధులు:

  • కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన నిధులను మండల paపరిషత్ లకు కేటాయించుట.
  • మండలములలో తయారుచేసిన ప్రణాళికల మొత్తం కలిపి జిల్లా ప్రణాళికగా తయారు చేయుట..
  • మండల పరిషత్ ల యొక్క బడ్జెట్లను పరిశీలించి ఆమోదించడం.
  • ప్రణాళికలు, ప్రాజెక్టులు, స్కీములు ఒక మండల పరిషత్ కు సంబందిచి గానీ లేక ఒకేవిధమైన రెండు లేక ఎక్కువ మండల పరిషత్ లకు సంబందించి గానీ అమలు చేయుట.
  • మండల పరిషత్ ల యొక్క కార్యక్రమములను పర్యవేక్షించుట.
  • అభివృద్ధి కార్యక్రమములకు సంబందించి ప్రభుత్వం ఇచ్చిన విధులను నిర్వహించుట.
  • అభివృద్ధి కార్యక్రమములకు మరియు జిల్లాలో ఇతర సేవా కార్యక్రమములకు సంబందించి ప్రభుత్వమునకు సూచనలు ఇచ్చుట.
  • గ్రామా పంచాయతీలు మరియు మండల పరిషత్ లకు కేటాఇంచబడిన పనులకు సంబందించి మరియు వాటి మధ్య సమన్వయం చేయుటకు ప్రభుత్వమునకు సలహా ఇచ్చుట.
  • ప్రభుత్వ ఉత్తర్వులను ప్రత్యేకముగా జిల్లా పరిషత్ కు ఇచ్చిన విషయములపై అమలు చేయుటకై ప్రభుత్వమునకు సలహా ఇచ్చుట.

శ్రీయుత ముఖ్యకర్యనిర్వహనాధికారి, జిల్లా ప్రజా పరిషత్ వారి ఆధ్వర్యంలో పరిపాలన నిర్వహించబడును.

2017-18 ఎస్ఎఫ్సి గ్రాంట్:

2017-18 సంవత్సరమునకు గాను ఎస్.ఎఫ్.సి. జడ్.పి. షేర్ గ్రాంట్ మొదటి మరియు రెండవ విడుతగా మొత్తం రూ.51.35 లక్షలు జనరల్ కాంపోనెంట్ గా ప్రభుత్వం వారి నుండి నిధులు విడుదల చేయుట జరిగినది. అట్టి నిధులు జిల్లా పరిషత్ సాధారణ మద్దునకు జమచేయనైనది.

2017-18 సంవత్సరమునాకు గాను ఎస్.ఎఫ్.సి. మండల షేర్ గ్రాంట్ మొదటి మరియు రెండవ విడుతగా మొత్తం రూ.32.09 లక్షలు జనరల్ కాంపోనెంట్ గా ప్రభుత్వం వారి నుండి నిధులు విడుదల చేయుట జరిగినది. అట్టి నిధులు మండల పరిషత్ లకు 2011జనాభా ప్రకారం సర్దుబాటు చేయుట జరిగినది.

ఎస్.ఎఫ్.సి. గ్రాంట్ ప్రగతి నివేదికలు:

2017-18 సంవత్సరమునకు గాను ఎస్.ఎఫ్.సి. జడ్.పి. షేర్ గ్రాంట్ మొదటి మjరియు రెండవ విడుతగా మొత్తం రూ.51.35 లక్షలు జనరల్ కంపోనెంట్ గా ప్రభుత్వం వారి నుండి నిధులు విడుదల చేయుట జరిగినది. రూ.37.60 లక్షల అంచనా విలువతో మొత్తం 11 పనులు మంజూరి చేసి చేపట్టుట జరిగినది.  ఇట్టి   11 పనులు ప్రగతిలో ఉన్నవి.

2017-18 సంవత్సరమునకు గాను జనరల్ ఫండ్ క్రింద రూ.245.33 లక్షల అంచనా విలువతో మొత్తం 120 పనులు మంజూరి చేసి చేపట్టుట జరిగినది.  ఇట్టి పనుల ప్రగతి నివేదిక ఈ దిగువ చూపనైనది.

పనుల వివరములు:-
క్రమసంఖ్య మంజూరు పేరు తీసుకున్న రచనల సంఖ్య అంచనా వ్యయం పూర్తయింది పురోగతి
1 35% జెడ్ పీ జనరల్ ఫండ్ 23 100.50 14 09
2 9% త్రాగు నీరు 28 29.90 17 11
3 15% SC ఫండ్స్ 05 23.50 02 03
4 6% ST ఫండ్స్ 06 23.15 01 05
5 15% W&CW ఫండ్స్ 14 32.60 01 13
6 20% జెడ్ పీ వాటా (MGNREGS) 44 35.68 44 0
మొత్తం:- 120 245.33 79 41

ముఖ్యకార్య నిర్వణాధికారి,
జిల్లా ప్రజా పరిషత్,
ఖమ్మం.