ముగించు

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి

ప్రభుత్వశాఖ యొక్క వివరణ

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధిశాఖ యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రజలకు, మనిషి యొక్క ప్రాధమిక అవసరము అయినటువంటి ఆహారమును జలాశయాలు, చెరువులు కుంటలు కాలువలు మరియు ఇతర మౌలిక సాదుపాయాముల ద్వారా పొలాలకు, సాగు నీరుని అందించి తద్వారా రైతులు పంటలు పండించే విధముగా చూసుకోనుట జరుగుతుంది.

అధికారుల సమాచారం

అధికారులు సమాచారం
క్రమ సంఖ్య అధికారులు పేర్లు  ఈ-మెయిల్ మొబైల్
1 స్వర్గం. నరసింహ రాంమ్ ఇన్స్టిట్యూట్ ఇరిగేషన్ ఆఫీసర్ & ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఖమ్మం ee_khm@yahoo[dot]co[dot]in 9701362538
2 ఎం అనద్ కుమార్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డివిజన్, సతుపల్లి. eeibspally@gmail[dot]com 9515668701

శాఖ కార్యకలాపాలు

ఖమ్మం జిల్లాలో 21 మండలాలలో రెండు ఇరిగేషన్ విభాగాలు ఉన్నాయి. అవి ఇరిగేషన్ డివిజన్ ఖమ్మం&ఇరిగేషన్ డివిజన్ సత్తుపల్లి.ఈ రెండు విభాగాలు 100 ఎకరాల పైనమరియు 100 ఎకరాల లోపు ఆయకట్టు యొక్క కార్యకలాపాలు& ఎంఐట్యాంకులు నిర్వహణ బాధ్యతలు ఉంటాయి.మరియు ఈ జిల్లా లో రెండు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు కలవు అవి వైరా మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుమరియు లంకా సాగర్ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు.

మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్:
క్ర.సం ప్రాజెక్ట్ పేరు ఆయకట్టు (ఎకరములు)
1 వైరా మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు 17390
2 లంకా సాగర్ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు. 7350
మొత్తం 24740
చిన్న నీటి పారుదల చెరువులు:
క్ర.సం ప్రాజెక్ట్ పేరు సంఖ్యలు ఆయకట్టు (ఎకరములు)
1 చెరువులు (100 ఎకరముల పైన ఆయకట్టు) 221 64715
2 చెరువులు (100 ఎకరముల లోపు ఆయకట్టు) 1090 36720
మొత్తం 1311 101435

ఖమ్మం జిల్లాలో సాగునీటి యొక్క విస్తీర్ణము1,26,175 ఎకరములు.

నీటి పారుదల శాఖ కు సంబందించిన పధకాలవివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో ఉన్నటువంటి అన్ని చెరువులను పునరుద్దరించుకొని వాటి యొక్క నీటినిల్వ సామర్ద్యాన్ని గోదావరి మరియు కృష్ణ బేసిన్ లు ద్వారా చిన్న నీటి వనరులకు కేటాయించిన నీటి ద్వారా పూర్తీ స్థాయికి పెంచుకోవాలను కుంటున్నది.ప్రభుత్వము పెద్ద ఎత్తున చేపట్టిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని “చిన్న నీటి వనరుల పురుద్దరణ” గా తరువాత దానిని “మిషన్ కాకతీయ” గా నామకరణం చేయడం జరిగినది ఈ కార్యక్రమములో ప్రతి సంవత్సరము 20 % చొప్పున దశల వారిగా ఐదేండ్లు అన్ని చెరువులను పునరుద్దరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

తాజా ప్రోగ్రెస్ రిపోర్ట్.

క్ర.సం. వివరములు అనుమతి లబించిన పనులు ఆయకట్టు (ఎకరములు) విలువ (రు” లక్షల లో) పూర్తీ స్తాయిలో పనులు అయినవి ఖర్చు (రు.లక్షలలో)  వ్యాఖ్యలు
1 యం కె I 292 సంఖ్యలు 33658 12552 292 7486  —
2 యం కె II 299 సంఖ్యలు 29956 12220 265 5216  —
3 యం కె III 164 సంఖ్యలు 29167 5884 48 651  —
4 యం కె IV 116 సంఖ్యలు 9287 2578 0 0
5 ఆర్ ఆర్ ఆర్ దశ-III స్టేజ్ i 08 సంఖ్యలు 1992 584 1 158.37  —
6 స్టేజ్ II 10 సంఖ్యలు 6436 2005 టెండర్ స్టేజ్

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి.
ఖమ్మం.